ఓం నమః శివాయ
నాకూ, మా బాబుకి శివ సుక్షేత్రాలు దర్శించడమంటే ఎంతో ఇష్టం. అత్యంత ప్రాముఖ్యం కలిగిన పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాలలో పూణేకి దగ్గరలో ఉన్న భీమశంకర ధామం ఒకటి. ఆ శంకరుని అనుగ్రహం చేత ఒక వారాంతం అక్కడికి వెళ్దామని అనుకున్నాం. 11 / 2 / 2011 న ముంబయ్ నుంచి భీమ శంకరం వెళ్ళడానికి MSRTC బస్సు టికెట్ బుక్ చేశాము. ఘాట్కోపర్ లో రావలసినదానికన్నా ఒక గంట ఆలస్యంగా వచ్చింది బస్సు. కొంత దూరం పోయాక, బస్సు కిటికీ లో నుంచి చూస్తే, ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంది. ఆ సౌందర్యాన్ని వీక్షిస్తూ మురిసిపోయాము. ఆహా ఏమి సోయగం! ఎటు చూసినా పచ్చదనం, చిన్న చెట్లకే కాయలుకాసినవి. మామిడి చెట్లు అటు చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా లేతగా, చిన్నగా ఉన్నా కూడా వాటికి నిండుగా పూత పూసి, ఎంత అందంగా ఉన్నాయో. అలాగే జామ చెట్లు కూడా అంతే. పంట పొలాలు అయితే పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా అన్నట్లు సస్య శ్యామలంగా అలరారుతూ ఉన్నాయి.

మేము అనుకున్నదాని కన్నా చాల ఎక్కువ సేపు పట్టింది భీమశంకరం చేరుకునే సరికి. దాదాపు రాత్రి 8 గంటలు అయింది. మేము వెళ్ళే సరికి గుడి తలుపులు వేసేస్తారేమోనని త్వరగా బయలుదేరాము. బస్సు దిగిన దగ్గర నుంచి, గుడి దగ్గరకు వెళ్ళటానికి అరగంట పట్టింది. పెద్ద పెద్ద మెట్లు, కొండలు తొలిచి వేశారు. సాధారణంగా గుడికి వెళ్ళడానికి మెట్లు ఎక్కాల్సి వస్తుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏమంటే, గుడికి వెళ్ళడానికి మెట్లు దిగి వెళ్ళాలి. పరుగు లాంటి నడకతో గుడి దగ్గరకు చేరుకున్నాము. గుడి పక్కనే ఉన్న దుకాణం లో పూలు, కాయలు తీసుకుని, పక్కనే ఉన్న కుండం లో కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాము. అక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా, నిజంగా దేవాలయం లాగా ఉంది. రణగొణ ధ్వనుల ఆచూకీయే లేదు. కనీసం జన సందోహాల కలకలాలు కూడా లేవు. అంతటి ప్రశస్తమైన ఆలయం ఇంత ప్రశాంతంగా ఉండడం ఆశ్చర్యంతో పాటు ఆసక్తిని, ఆనందాన్ని కలిగించింది. గర్భగుడిలో కేవలం నలుగురు ఆడ వారు, అర్చకులు ఉన్నారు. వారు అయ్యవారికి పూజ చేయించుకుంటున్నారు. మేమూ వెళ్ళి కూర్చున్నాము. అక్కడ గర్భగుడి లోకి వెళ్ళనిస్తారు. రాత్రి వేళ కావటం తో శివలింగానికి అలంకరణ తొడుగు పెట్టారు. పంచ ముఖాలతో అలరారుతూ ఎంత శోభాయమానంగా ఉందంటే చెప్ప శక్యము కాదు. ఆ భీమేశ్వరుని చూస్తూ అలా తన్మయత్వం లో ఉండిపోయాము. ఈరాత్రికి దర్శనం అవుతుందో లేదో అనుకున్న మేము ఇది అసలు ఊహించలేదు. కొన్ని ఆలయాలలో క్షణం పాటు దర్శనం కోసం గంటలు, రోజులు వేచియుండాల్సి వస్తున్నఈ రోజుల్లో, ఇంత ప్రశాంతంగా దగ్గరగా కూర్చుని పూజ చేసుకోవటం ఆ శివయ్యమాకు కల్గించిన అదృష్టమే కదా. ఎక్కువ జనం లేక పోవటంతో ఛాలా నెమ్మదిగా, ప్రశాంత చిత్తంతో పూజ చేసుకున్నాము.
ఆ రాత్రి అక్కడే ఉండి, ఉదయం మళ్ళీ దర్శనం చేసుకుని వెళ్ళాలని మా ఆలోచన. గుడి దగ్గరలోనే రూం ఖాళీ ఉంటే తీసుకున్నాము. రూం కి వెళ్ళి, లగేజీ పెట్టి అలా బయటికి వచ్చి వరండాలో నిలుచుంటే ఎదురుగా గుడి కన్పిస్తుంది. అలా చూస్తూ ఉంటే, ఆ అద్భుతమైన అనుభూతి ఎంతో మధురం. కానీ ఇంత దూరంలో కూడా కాకుండా, ఆ భీమ శంకరుని సన్నిధి లోనే ఉండగలిగితే బాగుంటుంది కదా అనిపించింది మా బాబుకి. గుడి ఆవరణలోనే పడుకుంటే బాగుంటది కదా అన్నాడు బాబు. బలే ఆలోచన వచ్చిందే. ఆ శివయ్యని స్మరిస్తూ ఆయన నిలయంలో నిలవడం సుకృతమే కదా. విశాలంగా ఉన్న గుడి ఆవరణలో, గుడి లో పని చేసేవారు ఇద్దరు పడుకుని ఉన్నారు. మేము కూడా ఆ వైపు పడుకుంటాము అని వాళ్ళని అడిగాము. వాళ్ళు దానికి ఒప్పుకోలేదు, గుడికి సంబంధించిన వాళ్ళు తప్ప మిగిలిన వారు ప్రవేశించకూడదని అన్నారు. అయ్యో ఎలా అనుకుని కాసేపు అక్కడే ఉండి, మళ్ళీ ఒకసారి అడుగుదామనుకుని కొంచెం సేపే ఉండి వెళ్తాము అని చెప్పి ఎలాగో ఒప్పించాము. తర్వాత బాబు వాళ్ళ ద్వారా ఉదయం ఎప్పుడు తలుపులు తీస్తారో, ఏవేళ అభిషేకం, పూజ చేస్తారో వివరాలు అడిగి తెలుసుకున్నాడు. తెల్లవారు ఝామున 5 లోపే అభిషేకం చేయించుకోవాలంట. ఆ తరువాత శివ లింగం పైన పంచ ముఖాల తొడుగు పెట్టేస్తారంట. ఇంక మేము 2 గంటలు పడుకుని లేచాము రూం కి వెళ్ళటానికి. చాలా సంతృప్తిగా అనిపించింది.
తెల్లవారుఝామున 4 గంటలకు మెలకువ వచ్చింది. అయిదు గంటల లోపే వెళ్ళాలి కదా ఎలా అనుకుని త్వరగా తయారయ్యాము. 5 గంటలు కావస్తుంది. అప్పటికి ఇంకా పూజ సగమే అయింది. హమ్మయ్య అయిపోలేదు కదా అనుకుని హారతి ఇచ్చిందాకా బయటే ఉండి, హారతి తీసుకున్నాము. లోపలికి వెళ్ళవచ్చో లేదో అనుకుంటూ ఉండగా పూజారులే రమ్మని పిలిచారు. వెళ్ళి శివయ్యకి దగ్గరగా కూర్చున్నాము. ఎంత సంతోషమేసిందంటే అసలు సాక్షాత్తూ అర్ధనారీశ్వరులే కళ్ళ ముందు ప్రత్యక్ష మైనారా అన్పించింది. అక్కడ శివ లింగం మధ్య లో పాపిటిలా ఉండి, రెండు లింగాల సంగమంలా ఉంటుంది. శివ పార్వతులు గా భావిస్తారు. శివలింగం యొక్క పానపట్టం లో ఉన్న చిన్న గుంట నుండి ఎప్పుడూ నీరు వస్తూ ఉంటుంది. ఆ నీరే భీమా నది. ఆ మహిమాన్విత శివ లింగం భీమేశ్వర జ్యోతిర్లింగం. పార్వతి అమ్మవారితో కలిసి వసించే అర్ధనారీశ్వరుడు, గంగా రూపిణి అయిన భీమాదేవిచే అనునిత్యం అభిషేకించబడే గంగాధరుడు. ప్రక్కనే కూర్చుని అభిషేకం, పూజ చేసుకున్నాము. గర్భాలయంలో ఉన్న అమ్మవారికి కూడా నమస్కరించుకుని, ఇంకా కొంత మంది పూజ చేసుకుంటుంటే చూస్తూ అక్కడే కూర్చున్నాము. ఎంత సేపు తాకి, నమస్కరించినా పూజారులు ఏమీ అనటం లేదు. తనివి తీరా మోటిచ్చుకుని నమస్కరించుకున్నాము. నిజంగా జన్మ ధన్యమయిందని చెప్పాలి. రాత్రి, ఇప్పుడు అలా దగ్గరే కూర్చుని పూజ చూసుకోవటం ఏ తపః ఫలమో. రాలేక రాలేక బయటికి వచ్చాము. అప్పుడు చూశాము అచ్చటి ప్రకృతి శోభని. చుట్టూ కొండశ్రేణులు, వాటి పైన దట్టంగా పచ్చని చెట్లమధ్యలో భీమశంకర స్వామి గుడి. ఆ గౌరీశుడు ఈ గిరుల అందానికి ముగ్ధుడై ఇక్కడ వెలశాడేమోఅనిపించింది.
గుడి దగ్గరనుంచి వచ్చి, రూం ఖాళీ చేసి ఇల్లు కల వాళ్ళకు తాళం ఇవ్వటానికి చూస్తే ఆ మామ్మ గారు లేరు. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. కూర్చోండి వస్తుందని వాళ్ళ అబ్బాయి చెప్పాడు. అది చిన్న హోటల్ లాంటిది. వడా పావ్ అని అక్కడ ఎక్కువగా తింటారు. అప్పటికి ఉదయం 9 దాటిందనుకుంటా ఆకలి మొదలైంది. ఏదో ఒకటిలే అని ఒక వడా పావ్ తెప్పించుకుని తిన్నాము. ఏమిటి ఈ మామ్మ ఎక్కడికి వెళ్ళిందో ఇంకా రాదేమి అనుకుంటున్నాము. రూం అద్దె డబ్బులు కుడా ఇవ్వాలి కదా. ఇంతలో కాళ్ళకు చెప్పులు, స్వెట్టర్ వేసుకుని కళ్ళద్దాలు పెట్టుకుని చాలా ఎత్తైన కొండ మీద నుంచి కర్ర పట్టుకుని చేతిలో ఏవో పట్టుకొని, టక టక నడుచుకుంటూ వస్తుంది ముసలమ్మ. అహా ఈవిడా ముసలమ్మా. కానే కాదు. ఈ వయసులో పొద్దున్నే కొండ ఎక్కిదిగి వస్తుందంటే ఎంత ఓపికా. చూట్టానికి చాలా సన్నగా ఉంది. ఆమెను ఈ కాలం వాళ్ళ మనుషులతో పోల్చనే లేము. రూం అద్దె టిఫిన్ డబ్బులు కలిపి ఇచ్చాము. వస్తూ మరో సారి భీమ శంకర స్వామికి నమస్కరించుకుని బయటికి వచ్చేమెట్లు ఎక్కుతూ పక్కన ఉన్న షాపుల్లో ఏమి ఉన్నాయో చూస్తున్నాము. అయినా రాత్రి రుద్రాక్ష లు కొని శివయ్యదగ్గర ఉంచి పూజ చేసుకున్నాముగా. ఇంకా ఉదయం ఏమి ఉన్నాయో నని చూస్తుంటే శంఖువులు బాగున్నాయి. ఒక శంఖువు కొన్నాము. ఇంకా ముచ్చటగా ఉన్న నాలుగు చిన్న చిన్న శివయ్య ఫోటోలు తీసుకున్నాము. అక్కడ పాలకోవా లాంటి స్వీట్ ఒకటి పెద్ద కళాయి లో చేస్తున్నారు. వాసన చూస్తుంటే తినాలని పించి కొంచెం తీసుకున్నాము. మెట్లు ఎక్కలేక ఎక్కుతున్నాను. చాలా పెద్దవి, బాబు చెయ్యి పట్టుకుని మెల్లగా రామ్మా అని అంటున్నాడు. ఇంతలో ఒక షాపు వద్ద పొట్టిగా, సన్నగా ఉన్న చాలా ముసలావిడ వడా పావ్.. వడా పావ్ అని కేక లేస్తుంది. ఏమిటి ఇక్కడ ఈ వయసులో కూడా ఇలా పని చేస్తున్నారు అని మాకు ఆశ్చర్యమేసింది. సరే చూద్దాము. ఇంతగా మామ్మగారు రమ్మంటున్నారు కదా అని లోపలికి వెళ్ళాము. వెళ్ళగానే వేడి వేడిగా వడా పావ్ చేసి ఇచ్చింది. చాలా బాగుంది. ఇంకోటి కావాలా అంటే సరే అన్నాము. మేము అడుగుతామని ముందే ఊహించినట్లు, రెండు నిమిషాల్లో చేసి ఇచ్చింది. బలే హుషారైన మామ్మ గారు అని నవ్వుకున్నాము. దారి మధ్యలో స్కూలు పిల్లలని తీసుకుని టీచర్లు గుడి దగ్గరకు వెళ్తున్నారు. చాలామంది పిల్లలు ఉన్నారు. ఇంకా పది మంది కుర్రాళ్ళు తెలుగు లో జోక్స్ వేసుకుంటూ వెళ్తున్నారు. నాకు తెలుగు వాళ్ళని చూస్తే సంతోషంగా ఉంటుంది. నానీ తెలుగు వాళ్ళు అంటూ మా బాబుకి చెప్పాను. దారిలో రాజరాజేశ్వరీ అమ్మవారి గుడి ఉంది. అమ్మవారు చాలా ప్రసన్నం గా కొలువై ఉన్నారు. దేవికి నమస్కరించుకుని బస్సు దగ్గరకు చేరుకున్నాము. అప్పటికి మధ్యాహ్నం 12 అయింది. మధ్యలో బస్సు ఆగినప్పుడు తిన్నాము. ముంబయ్ చేరేసరికి రాత్రి 11 అయింది. భీమ శంకర యాత్ర ఇంత సంతోషంగా జరిగినందుకు ఆ మహాదేవునికి మనసులోనే ధన్యోస్మి అనుకుంటూ విశ్రాంతి తీసుకున్నాము. తదుపరి మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయిని, ఓంకారేశ్వరం మరియు మహేశ్వరం యాత్రా విశేషాలు చెప్పుకుందాము.
శుభం భవతు .

No comments:
Post a Comment