ఓం నమః శివాయ సర్వం శివ మయo. నేను, మా బాబు నాని మొదటిగా బెంగుళూరు లోని బడా గణపతి మందిరం కు వెళ్ళాము. అక్కడ గణపతి విగ్రహం చాలా పెద్దగా దాదాపు 8 అడుగులు ఎత్తు గా కొలువు తీరి ఉంది. ఆ మహా గణపతికి మనసారా నమస్కరించుకుని, దగ్గర్లోనే ఉన్న బడా నంది విగ్రహం కూడా చూద్దామని వెళ్ళాము. అక్కడ నందీశ్వరుడు కూడా చాలా పెద్దగా ఉన్నాడు. ఆ నంది పైన శివ పార్వతులు చూడ ముచ్చటగా కొలువుతీరి ఉన్నారు.
మేము బెంగుళూరు నుంచి ముంబై చేరుకున్నాము. మా బాబు ఉద్యోగ రీత్యా ముంబైలో నివాసం ఉంటున్నాడు.
త్రయంబకం
28 -1 - 2011 న ముంబై నుంచి మహారాష్ట్ర లోని త్రయంబకేశ్వర స్వామి గుడికి బయల్దేరాము. నాసిక్ వరకు రైలు లో ప్రయాణం చేశాము. అక్కడ నుంచి కొంత దూరం బస్సులో, ఆ తర్వాత ఆటోలో గంట వరకూ ప్రయాణించిన తర్వాత సోమేశ్వర స్వామి గుడికి చేరుకున్నాము. అది జనవరి నెల అయినా కూడా ఉదయం 10 గంటలకే ఎండ ఎక్కువగానే ఉన్నట్లుగా ఉంది. కానీ అక్కడ ఇరు వైపులా చెట్లు ఉండి , దానికి తోడు మాకు ఆ శివయ్యని చూడాలనే ఆత్రుత వలన ఎండే తెలీలేదు.
అదిగో వచ్చేశాం, ఆ మహాదేవుని సన్నిధికి చేరుకున్నాం.
అక్కడ సోమేశ్వర స్వామి గుడికి తూర్పుగా పుణ్య
గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. ఆ పవిత్ర గోదావరిని సమీపించి, ఆమెకు ప్రణమిల్లి, ఆ పవిత్ర జలాన్ని శిరసున చల్లుకొని, కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చాము.గోదావరి నీరు చాలా స్వచ్చంగా నిర్మలంగా ఉన్నాయి. అక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. పక్కన పనస చెట్లు పెద్దవి,చిన్నవి కాయలు కూడా ఉన్నాయి.నేను అదే మొదటిగా ఆ చెట్లు చూడటం ,చాలా హ్యాపీగా ఉంది.మా బాబు ఐ .యస్ . ఐ (కలకత్తా ) లో చదివేటప్పుడు అక్కడ చాలా ఉన్నాయని చెప్పాడు. ఇంక గుడికి వెళ్ళాము. అక్కడ సోమేశ్వర స్వామి ధవళ వర్ణముతో లింగరూపంలో దేదీప్య మానంగా దర్సన మిస్తున్నట్లుంది చూట్టానికి రెండు కళ్ళు చాలవని పించింది .వర్ణించలేము చక్కగా మేమిద్దరం శివ లింగo ప్రక్కనే కుర్చుని స్వయంగా పూజ చేసుకున్నాము.మహారాష్ట్ర లో నాకు చాలా,చాలా నచ్చింది ఏమిటంటే మనమే గర్భ గుడి లోకి వెళ్ళి ,పూజ చేసుకోవటం. అక్కడ ఏ శివాలయం కి వెళ్ళినా, పూజారి బయట కూర్చుని ఉంటారు ,మనం లోపలికి వెళ్ళి, తాకి పూజ చేసుకోవచ్చు, ఎంత సేపు ఉన్నాఏమీ అనరు. గుడిలోకి మరాఠీ వాళ్ళు వచ్చి ,ధ్యానించుకుని వెళ్తున్నారు. మాకు అక్కడినుంచి కదలాలని ఉంటేగా. కానీ త్రయంబకం వెళ్ళాలి కాబట్టి, ఆ సోమేశ్వర మహాదేవునికి మరోసారి మనసారా నమస్కరించి, బయటికి వచ్చాము. ఆ ప్రశాంత వాతావరణం, ఆ సోమేశ్వర స్వామి దివ్య మంగళ రూపం మా మదిలో ఎప్పటికీ నిలిచితీరుతాయి.
అక్కడినించి త్రయంబకేశ్వరం బయలుదేరాం. బస్టాండ్ వరకు అటుగా వెళ్తున్న టాక్సీ మాట్లాడుకుని, త్రయంబకం వెళ్ళే బస్సు ల వద్దకు చేరుకున్నాము. ఆరోజు మరాఠీ వాళ్ళకు ఏదో విశేషమైన పండుగట. ఏ బస్సు చూసినా విపరీతమైన రద్దీ. మేము ఆ జనం లో ఎక్క లేక రెండు బస్సులు ఎక్కకుండా ఆగాము. అయినా ప్రతి ఒక్క బస్సు అలానే ఒత్తిడి గానే ఉంది. ఇంక ఎలాగో కష్టపడి, ఎక్కాము. కానీ నేను ముందు, మా బాబు చాలా చివర్న ఉన్నాము. ఎలా అక్కడేమో మరాఠీ,హిందీ నే మాట్లాడుతారు. నాకు హిందీ కొంచెమే వచ్చు. మా బాబు హిందీ,ఇంగ్లీష్ బాగా మాట్లాడుతాడు, బెంగాళీ కూడా తెల్సు .ఇప్పుడు చెరొక చోట ఉన్నాము. నాకన్నా ముందు బాబు కే కంగారుగా ఉంది, అమ్మ ఒక్కతే ఉంది, ఎలా అని. నేనేమో, నానీ ..నానీ అని పిలుస్తుంటే అందరూ నవ్వుతున్నారు. మొదట అర్ధం కాలేదు ఎందుకు నవ్వుతున్నారో తర్వాత వెలిగింది, హిందీ లో నానీ అంటే అమ్మమ్మ కదా అని. మాకూ నవ్వు వచ్చింది. కొద్ది సేపటి తర్వాత ఎలాగో ఇద్దరం ఒకేచోటుకు వచ్చాము. బస్సు లో ఎవరో చెప్పారంట బాబు తో ఈరోజు దర్శనం అవుతుందో, లేదో అని. ఎటు చూసినా జనం. బస్సు లో నే కాదు, వాళ్ళు చాలాదూరం నుంచి, కాలినడకన, పాటలు పాడుకుంటూ, భజనలు చేసుకుంటూ,ఒక పల్లకి లో శివుని ప్రతిమ ఉంచి, ఆ పల్లకిని తల మీద పెట్టుకు ప్రసాదాలు చేసుకుని, బస్సు రూటు లోనే త్రయంబకం వెళ్తున్నారు. ఆ జన ప్రవాహానికి బస్సు నెమ్మదిగా వెళ్తుంది, అప్పుడు, కిటికీ లో నుంచి మాకు ప్రసాదం పెట్టారు. మా మనసులో ఒకటే ధ్యాస. ఈరోజు దర్సనం అయితే బాగుండు నని. త్రయంబకం వచ్చేసింది. బస్సు దిగాము. గుడికి కొంచెం దూరం లో హోటల్ లో రూం తీసుకున్నాము.దారిలో కొందరిని అడుగగా..వారు ఈరోజే దర్శనం కావడానికి అవకాశం ఉంది, రేపు అస్సలు గుడిలోకి వెళ్ళటానికి ఖాళీ ఉండదు అన్నారు.అప్పటికి సాయంత్రం 4 యింది. మేము రూం లో ఒక అర్ధ గంట రెస్ట్ తీసుకుని, బట్టలు,పూజ సామాగ్రి తీసుకుని. అక్కడి పుణ్య గౌతమీ తటి లో స్నానం చేయడానికి బయలుదేరాము. మరాఠీ భక్తులు పెద్ద, పెద్ద వంట సామగ్రి తో,లారీ లలో వచ్చి, ఆ రాత్రి అక్కడి ఖాళీ ప్రదేశాలలో డేరాల్లంటివి వేసుకుని, అందులో చిన్నా, పెద్దా అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. మరుసటిరోజు వారంతా దర్శనం చేసుకుని, తెచ్చుకున్న సామగ్రి లో వంటచేసుకుని, తిని, తిరుగు ప్రయాణం చేస్తారనుకుంటా.
మేము త్వరగా స్నానం చేయుటకు గౌతమ మహర్షి శివునికి తపస్సు చేసి, శివుడు అనుగ్రహించగా ఏర్పడిన మహిమాన్విత గౌతమీ తటి వద్దకు వెళ్లి, స్నానం చేసి, అక్కడ ఉన్న విఘ్నేశ్వరునికి నమస్కరించి, ప్రక్కనే ఉన్న
గంగా మాత కు ప్రణమిల్లి, వడి వడి గా త్రిమూర్తి స్వరూపు డైన త్రయంకేశ్వర స్వామిని వీక్షించ డానికి అత్యంత
ఆత్రుత తో వెళ్తూ, దారిలో పూలూ, ప్రసాదాలు కొని, వెళ్ళి క్యూ లో నుంచున్నాము. చాలా పెద్ద క్యూ ఉంది.
మేము క్యూ వైపు చూస్తూ చాలా సమయం పడుతుందనుకు oటూ అలా రెండు నిముషాలు నుంచున్నాము. ఇంతలో 4 ,5 గురు మా దగ్గరకు వచ్చారు. వంద, రెండు వందలు ఇస్తే డైరెక్ట్ గా లోపలికి వెళ్ళేటట్లు చేస్తామని అన్నారు. అంత మంది జనం క్యూ లో ఉండగా వీళ్ళు ఎలా తీసుకు వెళతారు.. అయినా క్యూ లో నుంచుని వెళితేనే భగవంతుని కోసం మనం వేచి ఉన్నట్లు. అనుకుని, మేము వరుస లో నుంచున్నాము. అప్పటికి 5:30 దాటింది.ప్రదోష సమయం సమీపిస్తుంది. ఈశ్వరుడు తాండవ మాడే సమయం. ఆ సమయం లో దర్శనం జరగటం.. శివానుగ్రహమే కదా. అనుకుని, పాటలు పాడుకుంటూ వరుస లో నుంచున్నాము.
ఎదురుగా ఆ త్ర్యంబకేశుడు కొలువు తీరియున్న గుడి, ధ్వజ స్తంభం, విశాలమైన కొండ శ్రేణులు. చిత్రకారుడు గీసినట్లు కొండలు వరుసగా ఎత్తు, పల్లం గా ఎంతో అందంగా ఉన్నాయి. అప్పుడే భానుడు తల్లి ఒడిలోకి కొండల క్రిందుగా దిగుతూ వెళ్తున్నాడు. ఆ సంధ్యా కిరణాలు గుడి పైన, కొండల మీద పడ్తున్నాయి. ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉందో అది వర్ణనాతీతం. అద్భుతం, అమోఘం. అంత సుందర దృశ్యం తన కెమెరాలో బంధించకుండా ఉంటాడా మా బాబు. ఆ వచ్చేస్తున్నాం.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయ్యవారి దర్శన భాగ్యం మరి కొద్ది క్షణాల్లో కలగబోతుంది. లైన్ జరుగుతుంది..
మా మది లో అనిర్వచనీయమైన ఆనందం. ఎదురుగా టీవీ లో, గుడిలో పూజాదికాలు చేయటం చూపిసున్నారు. అవి చూస్తూ వెళ్తున్నాము. మెల్లగా ధ్వజస్తంభం దాటాము. ఇంకొంచెం ముందుకు వెళ్తే ప్రక్కన వినాయకస్వామి, ఆ స్వామికి నమస్కరించి, ముందుకు కదిలాము. లోపలికి వచ్చేశాం. కొంచెం అలా..అలా ముందుకు వెళ్తూ ఆ ఆది దేవుడు, సృష్టి,స్థితి,లయ కారకుడైన త్రిమూర్తి రూపుని చూడాలని, చూపంతా అటే ఉంచాము.ఆ.. వచ్చేశాం. ఎదురుగా ఒకే పానపట్టం లో ముమ్మూర్తులా మూడు శివ లింగాలు. తన్మయత్వం తో మది ఉప్పొంగగా, తనివితీరా ఆ మహాదేవునికి భక్తి పారవశ్యం తో నమస్కరించుకున్నాము.
అప్పటికి రాత్రి 8 30 కావటం వలన భోజనం చేద్దామని దగ్గరలోని హోటల్ కు వెళ్ళాము. ఆర్డర్ చెప్పిన కాసేపటికి కాసేపటికి భోజనం తీసుకువచ్చారు. కొంచెం వరి అన్నం, రెండు మైదా పిండి రోటీలు. పాలక్ పన్నీర్, ఆలూ కర్రీ ఇంకా గుర్తులేదు మొత్తానికి ఎలాగో తిన్నాము. అక్కడ రోటీలే ఎక్కువ. ఆంధ్రా వాళ్లకు వారు పెట్టే గుప్పెడు మెతుకులు పిల్లలకు కూడా చాలవు.హోటల్ నించి మేముండే హోటల్ రూం కి వెళ్ళాము. ఊటీ లో ఎంత చలో తెలీదు కానీ అక్కడ ఉన్న చలికి మాత్రం దుప్పట్లు, పరుపులు మంచు ముద్దల్లా ఉన్నాయి. చేతులు,కాళ్ళు చల్లగా మొద్దుబారి పోయాయి. అంత చలికి నిద్ర ఎలా పడ్తుంది. ఏదో కాసేపు అలా అలసిన శరీరానికి విశ్రాంతినిచ్చి, తెల్లవారుఝామున 4 గంటలకే లేచి,ఆ చలిలోనే బస్టాండ్ కి వెళ్ళాము. మరోసారి ఆ త్రయంబకేశ్వర స్వామిని మనసులో స్మరించుకుని షిరిడీ వెళ్ళటానికి,షిరిడీ వెళ్ళే బస్సు ఎక్కాము. చలికి మా పెదాలు పగిలి మాట్లాడటానికి కూడా చాలా కష్టంగా ఉంది .షిరిడీ వెళ్ళి, అక్కడినించి శనీశ్వరుదు స్వయంగా వెలసిన శని సింగణాపూర్ వెళ్ళి అక్కడినించి ముంబయ్ వెళ్దాం అనుకున్నాము. కానీ సమయం ఎక్కువ లేదు. షిరిడీ లో బస్సు దిగిన వెంటనే సామానులు, పూలు,కొబ్బరికాయలు కొన్నషాపు లో ఉంచి, బాబా దర్సనం కోసం బయల్దేరాము. జనం బాగా ఎక్కువే ఉన్నారు. అయినా పర్లేదు వరుస చక్కగా కదులుతుంది.మేము చాలా వేగంగా నడుస్తూ వెళ్ళి, వరుసలో నుంచున్నాము.అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. అడుగడుగునా గాలి పంకాలు, మంచినీళ్ళు, కూర్చుంటానికి బల్లలు బారుగా ఉన్నాయి. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా అన్ని వసతులూ ఉన్నాయి. అలా జరుగుతూ ఆ బాబాకి దగ్గరవుతూ ఉన్నాము. మాకు ముందు నుంచున్న వారిలో ఒక చిన్ని బాబు వాళ్ళ అమ్మ భుజం ఫై ఉండి మా వైపు అలానే చూస్తూ ఉన్నాడు. చాలా ముద్దొస్తున్నాడు. ఆ బాబు అలా అమాయకంగా చూస్తుంటే నేను రమ్మన్నట్లు సైగ చేస్తూ నవ్వాను. బాబు మొదట అలానే చూసి, వేరొక వైపు తిరిగాడు. కొంచెం సేపటికి మళ్ళీ ఇటు తిరిగాడు. నేను మళ్ళీ అలానే చెయ్యి ఊపుతూ నవ్వాను. ఈసారి బాబు కుడా నవ్వాడు. నేను చూడమని మా నానీకి చెప్పాను. అలా మా ఇద్దరి వంక బుల్లి బాబు నవ్వుతూ చూస్తూ, మధ్యలో మేము కనిపించక పొతే వెతుక్కుంటున్నాడు. ఆ పసివాడిని చూస్తుంటే చాలా ముచ్చటేసింది. ఈ సందట్లో బాబా దగ్గరకు వచ్చేశాము. బాబా పాలరాతి విగ్రహం. ఒక కాలు మడిచి, ఇంకొకటి దానిపైన పెట్టుకుని అభయ హస్తం తో చిరునవ్వు చిందిస్తూ ఉన్నారు. శాంతి స్వరూపుడైన బాబా దర్శనంతో మనసు ప్రశాంతతని పొందింది. మనసారా నమస్కరించుకుని, తెచ్చిన పూలూ, ప్రసాదం సమర్పించుకుని వెలుపలికి వచ్చాము.
అక్కడినించి సింగ ణాపూర్ వెళ్ళే వాహనాలు ఎక్కువగా నిండిపోయి ఉన్నాయి. మేము కొంచెం ఆగితే ఉంటాయనుకుని చూస్తూ ఉండగా ఒక వాన్ లో ఖాళీ ఉంటే అందులో ఎక్కాము. సింగణాపూర్ లో ఒక విశేషముంది. ఏమంటే ఆ ఉరిలో ఇళ్లకు తలుపులు ఉండవు. మేము వాన్ లో వెళ్తూ చూశాము, ఇళ్ళకు, బళ్ళకే కాదు దుకాణాలకి కూడా తలుపులు లేవు. ఆ మహా శక్తివంతుడైన శనీశ్వరుడే వాళ్ళని, వాళ్ళ వస్తువులని కాపాడతాడని వారి నమ్మకం. వాన్ గుడికి కొంచెం దగ్గరలో ఆగింది. అక్కడ మగవారు మాత్రమే దగ్గరగా వెళ్ళి, నువ్వుల నూనె తో అభిషేకం చేసుకోవచ్చు. ఆడవారు కొంచెం ఎడం గా వేరే వరుస లో వెళ్ళి దండం పెట్టుకుంటారు. మా బాబు అలా స్నానం చేసి ఎర్రటి ధోవతి (అక్కడ కొనుక్కోవాలి లేదా పూజ సామాగ్రీ కొన్న దుకాణాల వాళ్ళు ఇస్తారు) కట్టుకుని, నువ్వుల నూనె తీసుకున్నాడు. నేను కూడా పూజ సామగ్రి తీసుకుని, చెరొక వరుస లో నుంచున్నాము. అక్కడ ఈశ్వరుని పేరు గల సూర్య పుత్రుదు, యమ సహోదరుడైన శనీశ్వరుడు గుడిలోపల కాకుండా, బయట కొలువు తీరియున్నాడు. ఎత్తుగా, కొంచెం ఏటవాలుగా నిగనిగలాడే ఒక నల్లని శిలా ఫలకం, ఆయనే స్వయంభువుడు, ఆశుభాపహారి అయిన శనీశ్వరుడు. తన్మయత్వం తో నమస్కరించుకున్నాము. మా బాబు నూనెతో అభిషేకించిన తర్వాత ధోవతి మార్చుకుని, ప్రసాదం తీసుకుని, వచ్చి వాన్ లో కూర్చున్నాము. అప్పటికే మిగతా వాళ్ళు వచ్చేశారు.అక్కడి నించి వస్తూ ఉండగా మధ్యలో తెలుగు వాళ్ళు వాన్ లో ఎక్కారు. వాళ్ళతో కాసేపు ముచ్చట్లు. మీది తెలుగు మాది తెలుగు లాగా. ఇక షిరిడీ లో దిగి, ముంబయ్ కి బుక్ చేసుకున్న బస్సు ఆగే దగ్గరకు వెళ్ళాము. అయిదు నిమిషాల్లో బస్సు వచ్చేసింది. అమ్మో కొంచెం ఆలస్య మైతే బస్సు వెళ్ళిపోయేది అనుకుని బస్సు ఎక్కాము. హమ్మయ్య భగవంతుని దయతో మా పుణ్య యాత్ర సదా క్షేమంగా. శుభప్రదంగా జరిగినందుకు ఆ జగదీశ్వరుడు త్రయంబకేశ్వరునకు, శుభంకరుడు శనీశ్వరునికి, సద్గురు సాయినాథునికి మనసులో కృతఙ్ఞతలు తెలుపుకుని ధన్యోస్మి అనుకున్నాము. సంతోషంగా ఇద్దరం సీటు లో నిద్రకు ఉపక్రమించాం. రాత్రి 1 30 కి క్షేమంగా ఇంటికి చేరుకున్నాము. తదుపరి భీమశంకర యాత్రలోని విశేషాలు చెప్పుకుందాము.
సర్వేజనా సుఖినో భవంతు.

బాగా రాశావు బుజ్జీ. ఇంకా బాగా రాయగలవు, రాయాలి.
ReplyDelete